తెలంగాణ
Harish Rao: కేసీఆర్‌తో హరీష్ రావు సమావేశం

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లికి చేరుకున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్‌తో హరీష్ రావు సమావేశమయ్యారు. రేపు బీఆర్‌కే భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు కాసేపట్లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు.
కేసీఆర్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్‌కే భవన్‌కు రేపు పెద్ద ఎత్తున తరలిరావాలని ఇప్పటికే పిలుపు నిచ్చాచరు. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుని విచారించింది. విచారణ తర్వాత కేసీఆర్‌ను కూడా హరీష్ రావు కలిశారు. జరిగిన పరిణామాలపై వివరించారు. ఇవాళ మరోసారి కేసీఆర్‌తో భేటీ కానున్నారు హరీష్ రావు.