ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో టీడీపీకి ఎదురుదెబ్బ.. సీనియర్‌ నాయకుడు రాజీనామా

ఏపీలో అధికార కూటమి పార్టీ టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. అన్నమయ్య జిల్లాలో సీనియర్‌ నాయకులు సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను అందజేశారు. సుగవాసి సుబ్రహ్మణ్యం 2024లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ సీనియర్ లీడర్ సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడుగా సుబ్రహ్మణ్యం రాజకీయాల్లోకి వచ్చారు.

తన రాజీనామా సందర్భంగా సుగవాసి సుబ్రహ్మణ్యం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో సముచిత స్థానం ఇవ్వడం లేదని, మహానాడులో పాలకొండ్రాయుడికి నివాళులు సక్రమంగా అర్పించలేదని మండిపడ్డారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమను తొక్కేస్తున్నాడని గతంలో బహిరంగంగా సుబ్రహ్మణ్యం విమర్శలు చేశారు. ఇక, సుబ్రహ్మణ్యం రాజీనామాతో రాయచోటి, రాజంపేటలో టీడీపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు పలువురు రాజకీయ నేతలు చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button