Kannappa: ‘కన్నప్ప’ సినిమా హార్డ్ డిస్క్ మాయం

Kannappa: త్వరలోనే విడుదల కానున్న ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించిన హార్డ్‌డ్రైవ్ మాయమైంది. అయితే సినిమాలో కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్‌డిస్క్ ఇదేనని సమాచారం. దీంతో 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఫిలింనగర్ పీఎస్‌లో సినిమా నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. ‘అదృశ్య శక్తుల ప్రోద్బలంతో’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
హార్డ్ డిస్క్‌ను తమ ఉద్యోగి చోరీ చేసిందని 24 ఫ్రేమ్స్ సంస్థ కంప్లయింట్లో పేర్కొంది. కాగా ఈ నెల 24న ముంబై నుంచి పార్శిల్ ద్వారా, హైదరాబాద్‌కు తరలించారు ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్. డెలవరీ సమయంలో హార్డ్ డిస్క్‌ను రిసీవ్ చేసుకున్నాడు ఆఫీసు బాయ్ రఘు. అనంతరం హార్డ్‌డిస్క్‌ను తీసుకొని చరిత అనే యువతికి అందజేశాడు రఘు. ప్రస్తుతం హార్డ్‌డిస్క్ తీసుకొని చరిత తప్పించుకు తిరుగుతున్నట్లు సమాచారం. గతంలో మనోజ్ వద్ద డ్రైవర్‌గా, పీఏగా పనిచేసిన వ్యక్తియే రఘు.