ఆంధ్ర ప్రదేశ్
AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్‌గా రాయపాటి శైలజ

AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్‌గా శైలజ బాధ్యతలు చేపట్టారు. నమ్మకంతో బరువైన బాధ్యతను అప్పజెప్పినందుకు బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు. మహిళ హక్కులు, సంక్షేమ సాధనకు తోడ్పడతానన్నారు. మహిళల రక్షణ కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు.
పార్టీలకతీతంగా అందరికీ న్యాయం చేస్తనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారంగా పోస్టులు పెడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.