సినిమా

పవన్ కళ్యాణ్‌కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు!

పవన్ కళ్యాణ్ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం అందుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో అసాధారణ నైపుణ్యం చాటిన ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదు దక్కింది. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో ఈ గౌరవం పొందారు. ఈ ఘనత గురించి పూర్తి వివరాలు చూద్దాం.

పవన్ కళ్యాణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరో గొప్ప గుర్తింపు లభించింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందారు. మూడు దశాబ్దాలకు పైగా క్రమశిక్షణతో సాధన చేసిన ఆయనకు జపాన్‌లోని ప్రతిష్ఠాత్మక సంస్థ ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ బిరుదు అందుకున్నారు. అలాగే ‘టకెడా షింగెన్ క్లాన్’లో జపాన్‌లో తొలి తెలుగు వ్యక్తిగా చేరారు.

ఇది అరుదైన ఘనత. తాజాగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే అద్భుత బిరుదును ప్రకటించింది. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద ‘కెండో’లో శిక్షణ పొంది ఉన్నత స్థాయి నైపుణ్యం సంపాదించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button