ఆంధ్ర ప్రదేశ్
చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయంపై వైఎస్ జగన్

YS Jagan: చంద్రబాబుకు అధికారమిచ్చింది పేదల సొంతించి కలలను నాశనం చేయడానికా అని ప్రశ్నించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు పేదల వ్యతిరేకి అని మరోసారి రుజువైందని Xలో విమర్శించారు మాజీ సీఎం జగన్. పేద మహిళలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దుచేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అని ఫైర్ అయ్యారు. తక్షణం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము సొంతింటి కలను నిజం చేసేలా పేదలందరికీ ఇళ్లు ఇచ్చామని చంద్రబాబు ఎప్పుడైనా అలాంటి మంచిపని చేశారా అని ప్రశ్నించారు.



