ఆంధ్ర ప్రదేశ్
Jagan: చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం

Jagan: చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నామని జగన్ అన్నారు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నామన్నారు. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడమే అన్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారని మండిపడ్డారు.
ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మరింత ఘోరంగా తయారైందన్నారు జగన్.



