ఆంధ్ర ప్రదేశ్
భద్రాచలం ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ

భద్రాచలం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలగా.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు శిథిలాల కింద ఉన్న కామేష్‌ను సిబ్బంది ప్రాణాలతో బయటకి తీసింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనలో కామేష్ ఎడమ కాలు తుంటి దగ్గర అండ్ కామేష్ ఎడమ చేయి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. అయితే చికిత్స పొందుతూ కామేష్ మృతి చెందాడు. అటు శిథిలాల కింద ఉపేందర్ కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో ఉపేందర్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.