తెలంగాణ
జగద్గిరిగుట్టలో ప్రమాదం.. ఇంట్లో పేలిన సిలిండర్

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ప్రమాదం జరిగింది. ఆస్బెస్టాస్ కాలనీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. గాయపడిన వారిని ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.



