తెలంగాణ
Hyderabad:పెళ్లి పేరుతో వైద్యురాలిపై లైంగిక దాడి

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ప్రముఖ హోటల్లో అత్యాచారం చేశాడు. బాధిత వైద్యురాలు నీలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు డాక్టర్ స్వామి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
హోటల్‌కు పిలిచి వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు బాధిత వైద్యురాలు చెబుతోంది. జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు కన్నీళ్ల పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్ పీఎస్‌లో డాక్టర్ స్వామిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.