ఆంధ్ర ప్రదేశ్
Nandyala: భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!

Nandyala: భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు నూనెపల్లెకు చెందిన రమణయ్యకు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది.
గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకునిరావడానికి భర్త వెళ్లగా ఘర్షణ జరిగింది.
భార్య తన తమ్ముడితో కలిసి దాడిచేయడంతో భర్త రమణయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఇంటి వద్ద పడేసి పరారయ్యారు. మృతుడి భార్యను నంద్యాల త్రీ టౌన్ పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.