Nagarjuna: నాగ్ 100వ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే?

Nagarjuna: ‘నా సామి రంగ’ సినిమా తర్వాత నాగార్జున సోలో సినిమాని ఇంత వరకూ ప్రకటించలేదు. తమిళ స్టార్లతో కలిసి ‘కుభేర’, ‘కూలీ’ చిత్రాలు చేస్తున్నారు తప్ప సోలో సినిమాపై క్లారిటీ రావడం లేదు. తాజాగా ఆయన 100 వ సినిమాపై చర్చ నడుస్తుంది.
ఇప్పటికే నాగార్జున కోసం పూరి జగన్నాధ్, తమిళ డైరెక్టర్ నవీన్ లాంటి వాళ్లు చేస్తున్నారు. అలాగే ప్రసన్న కుమార్ కూడా అప్పట్లో స్టోరీ చెప్పాడు. ఆ తర్వాత దానిపై కూడా క్లారిటీ లేదు. అలాగే ‘గాడ్ ఫాదర్`’ ఫేం మోహన్ రాజా కూడా నాగార్జునకు స్టోరీ నేరేట్ చేసినట్లు వార్తలొచ్చాయి. కానీ వీళ్ల సినిమాల గురించి నాగార్జున ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా ‘నితం ఓరువానం’ దర్శకుడు కార్తీక్ పేరు వినిపిస్తుంది. తెలుగులో నితం ఓరువానం సినిమా ‘ఆకాశం’ టైటిల్ తో అనువాదమైంది. ఇది ఇక్కడా పెద్దగా ఆడలేదు. అయితే కార్తీక్ కూడా తాజాగా నాగార్జునకు స్టోరీ వినిపించారుట. ఇది ఓ పాన్ ఇండియా సబ్జెక్ట్ అని సమాచారం. ఇది నాగ్ కి నచ్చడంతో ఆయనా పాజిటివ్ గా స్పందించారుట. దీంతో నాగ్ 100 వ సినిమాకి కార్తీక్ పేరు ఎక్కవగా వినిపిస్తుంది. మరి నాగ్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి.