తెలంగాణ
Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది

Bandi Sanjay: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ . కరీంనగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేశారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యపు పాలన నడుస్తుందన్నారు. జన్ పత్, గాంధీభవన్ నుండి పాలన నడుస్తూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు.
మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందనడం విడ్డూరమని,మంత్రివర్గ విస్తరణ సీఎం విచక్షణాధికారం అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షులు చెప్పడం సిగ్గు చేటని, తెలంగాణ లో దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారన్నారు. పాలనపై సీఎంకు పట్టులేకుండా పోయిందని, హెచ్ సీయూ భూముల వ్యవహారమే ఇందుకు కారణమన్నారు.