తెలంగాణ
Hyderabad: బంజారాహిల్స్‌లో కుంగిన రోడ్డు.. నాలాలో పడిపోయిన వాటర్ ట్యాంకర్

Banjara Hills: బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 మహేశ్వరి చాంబర్స్‌లోని రోడ్డు కుంగింది. దీంతో వాటర్ సప్లై చేసే ట్యాంకర్ నాలాలో పడిపోయింది. కాగా ఉదయం మహేశ్వరి చాంబర్కు పదివేల లీటర్లు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వెళ్తుంది.
వీధిలోకి రాగానే ఒక్కసారిగా కుంగింది. నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బ తినడంతో ట్యాంకర్ నాలాలో పడింది. కాగా ఘటనలో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.



