ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటనలో అపశ్రుతి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పలమనేరు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆదివారం సందర్శించారు. అయితే పవన్ కళ్యాణ్‌ను తిరిగి వెళ్తున్న సమయంలో ఆయనను చూసేందుకు భారీగా జనం వచ్చారు.
పవన్ కాన్వాయి వచ్చిన సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఆ జనంలో ఉన్న హేమలతను స్థానికులు తోసివేయడంతో కాలు విరిగింది. ప్రస్తుతం పలమనేరు ఆస్పత్రిలో చేరిన హేమలతకు వైద్యులు వైద్యం అందిస్తున్నారు.



