అంతర్జాతీయం
Vladimir Putin: 2020లో ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగేది కాదు

Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు నిజమేనని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఒకవేళ 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదని చెప్పారు.
రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా ట్రంప్ అడ్డుపడేవారని తెలిపారు. ట్రంప్ చురుకైన వ్యక్తి అని, చెప్పింది చేసి చూపించే నేత అని కొనియాడారు. ఈమేరకు రష్యా టెలివిజన్‌లో మాట్లాడుతూ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.