సినిమా
Vijay Deverakonda: విజయ్ దేవరకొండకి ఆరోగ్య సమస్య?

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఆస్పత్రిలో చేరారన్న వార్త అభిమానులను కలవరపరిచింది. విజయ్ త్వరలో కింగ్ డం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఆరోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరారు. డెంగ్యూ జ్వరం కారణంగా ఆయన చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఆయన కుటుంబ సభ్యులు, వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 31న విడుదల కానున్న కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్‌లో ఆయన భాగం కాలేకపోయారు.
అయినప్పటికీ, ఆయన త్వరలో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సినిమా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో విజయ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.