News
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు..?
త్వరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను టాలీవుడ్ పెద్దలు కలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఏపీకి సినీ పరిశ్రమ రావాలని.. ఓ సభలో పవన్ పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో షూటింగ్‌లు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ పెద్దలు ఏపీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ వ్యవహారం.. కాకరేపుతోంది. మొన్న అల్లు అర్జున్‌ను పరామర్శించడంతో సినీ పెద్దలపై సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఇదిఇలా ఉంటే.. సినీ పరిశ్రమ ఏపీకి రావాలని.. డిప్యూటీ సీఎం పవన్ కామెంట్ చేశారు.
ఈ క్రమంలో.. ఏపీకి సినీ పెద్దలు వెళ్లాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని సినిమాలు చేస్తున్న నటులు ఏపీకి వెళ్తారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.