ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: సీఎం చంద్రబాబుపై విడదల రజిని ఫైర్

Vidadala Rajini: సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ మంత్రి విడదల రజినీ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం చంపేస్తుందని మండిపడ్డారు.
కాలేజీలను అమ్మకానికి పెట్టడంతో పేదల ఆరోగ్యంపై భారం పడుతుందన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కాం అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తామని రజినీ తెచ్చి చెప్పారు.



