ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: రాష్ట్రంలో సుపరిపాలన కాదు.. రెడ్ బుక్ పాలన నడుస్తుంది

Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడదల రజిని పాల్గొన్నారు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రతి విద్యార్ధికి తల్లికి వందనమని కొంత మందికే ఇచ్చి తల్లుల ఉసురుపోసుకున్నారని అన్నారు.
అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుజాడల్లోనే అవినీతి బ్రాండ్ అంబాసిడర్ ముద్ర వేసుకున్న ఘనాపాటి ప్రత్తిపాటి అని చిలకలూరిపేట ప్రజానీకానికి తెలుసని అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు రెడ్ బుక్ పాలన నడుస్తుందని విడదల రజినీ మండిపడ్డారు.