ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు

Vidadala Rajini: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని పర్యటించారు. మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను విడదల రజిని పరామర్శించారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను విడదల రజిని పరిశీలించారు.
కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విడదల రజిని మండిపడ్డారు. తుఫాను కారణంగా భారీగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విడదల రజిని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు.



