ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరోసారి తీవ్ర అస్వస్థత

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీస్ కస్టడీలో ఉన్న వంశీ శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వల్లభనేని వంశీని తరలించారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు వంశీ.