తెలంగాణ
Vakiti Srihari: బీసీ రిజర్వేషన్లు 9 షెడ్యూల్‌లో చేర్చాలి

Vakiti Srihari: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 9వ షెడ్యూల్‌లో చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బీసీ బంద్ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ బస్ డిపో వద్ద బైఠాయించాయి. ఎంపీ అనిల్ కుమార్, యువజన సంఘాలు, కాంగ్రెస్ శ్రేణలు భారీగా పాల్గొని కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.



