సినిమా

ఆడపులికి క్లీంకార పేరు.. హైదరాబాద్‌ జూకు థాంక్స్‌ చెప్పిన ఉపాసన

హైదరాబాద్ నెహ్రూ జూలో ఓ ఆడపులికి క్లీంకార అని నామకరణం చేశారు. ఉపాసన, తన కూతురితో కలిసి జూని సందర్శించి, పులిని దత్తత తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఓ ఆడపులికి ‘క్లీంకార’ అని పేరు పెట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన, తన కూతురు క్లీంకారతో కలిసి జూని సందర్శించారు. ఈ సందర్భంగా ఓ చురుకైన ఆడపులిని దత్తత తీసుకుని, దాని సంరక్షణ కోసం నిధులను జూ డైరెక్టర్ డా. సునీల్ హిరేమత్‌కు అందజేశారు.

గత ఏడాది చిన్న పిల్లగా ఉన్న ఈ పులి, ఇప్పుడు ఉల్లాసమైన ఆడపులిగా మారిందని ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకుంటూ, “వన్యప్రాణుల సంరక్షణకు మద్దతిచ్చే జూ బృందానికి కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. క్లీంకారతో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఉపాసన చొరవకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ, వన్యప్రాణుల పరిరక్షణలో ఆమె చేస్తున్న కృషిని కొనియాడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button