సినిమా
Vijay Deverakondas: హీరో విజయ్ దేవరకొండ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసిన హైకోర్టు

Vijay Deverakondas: హీరో విజయ్ దేవరకొండ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. గిరిజనలను కించపరిచేలా, వారి ప్రతిష్ట దెబ్బ తీసేలా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారని గతంలో రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని హైకోర్టులో విజయ్ దేవరకొండ పిటిషన్ దాఖలు చేశారు. తను వ్యాఖ్యలు చేసిన 2 నెలల తరువాత ఫిర్యాదు చేశారని ఇందులో దురుద్దేశం ఉందని విజయ్ దేవరకొండ తరఫు లాయర్ వాదనలు వినిపించారు.
సామాజిక మాధ్యమాల్లో విజయ్ దేవరకొండ క్షమాపణ కూడా చెప్పారని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో క్షమాపణను పరిగణలోకి తీసుకోకూడదని ప్రతివాదుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.