సుడిగాలి సుధీర్ హీరోయిన్‌కి అవమానం.. Xలో ఆగ్రహం!

Divyabharathi: తమిళ హీరోయిన్ దివ్యభారతి తెలుగులో తొలి చిత్రం ‘గోట్’ షూటింగ్‌లో దర్శకుడు నరేశ్ కుప్పిలి అవమానించాడని ఆరోపిస్తోంది. హీరో సుడిగాలి సుధీర్ మాత్రం మౌనంగా ఉండటం బాధించిందని ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
సుడిగాలి సుధీర్ హీరోగా, నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో ప్రారంభమైన ‘గోట్’ చిత్రం నుంచి దర్శకుడు తప్పుకున్నాడు. నిర్మాత టేకోవర్ చేసినా పాట ప్రమోషన్స్ సమయంలో నరేశ్ మళ్లీ వివాదాస్పద ట్వీట్ చేశాడు. హీరోయిన్‌ను ‘చిలక’ అని, ఎడిట్‌లో తీసేసిన షాట్స్‌తో కాలం గడపాలని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
దీనికి దివ్యభారతి స్క్రీన్‌షాట్ పెట్టి ఘాటుగా బదులిచ్చింది. షూటింగ్‌లో తనను తీవ్రంగా అవమానించాడని, హీరో సుడిగాలి సుధీర్ సైలెంట్‌గా ఉండటం నిరాశపరిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో చిత్ర యూనిట్‌లో ఉద్రిక్తత నెలకొంది.



