ఆంధ్ర ప్రదేశ్
Tirumala Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు

Tirumala Ghee Case: కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏకంగా పదిమంది టీటీడీ ఉద్యోగులు కల్తీ నెయ్యి నిందితులకు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధా రణకు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో కల్తీ నెయ్యికి సహకరించిన టీటీడీ ఉద్యోగులపై పాలకమండలి చర్యలు తీసుకునే అవకాశం కన్పిస్తోంది.
మరోవైపు A12 హరిమోహన్, A15 ఆశీష్ అగర్వాల్‌ను సిట్ అధికారులు అలిపిరి సమీపంలోని కార్యాలయంలో విచారిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలో ఎలాంటి ముడిపదార్ధాలు కలిపారు జంతువుల కొవ్వును ఏమేరకు కలిపారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితులపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.