Newsఆంధ్ర ప్రదేశ్

సక్సెస్ ఫుల్ ఆంత్రప్రెన్యూర్షిప్ కి సీక్రెట్ ఇదే

•⁠ ⁠నిత్యం విద్యార్థిగా రీసెర్చ్ చేయాలి
•⁠ ⁠ఆంత్రప్రెన్యూర్షిప్ కేవలం బిజినెస్ మాత్రమే కాదు..
•⁠ ⁠సమాజం అవసరాలు తీర్చే ఆలోచనలు చేయాలి
•⁠ ⁠విట్స్ లో కేబీకే గ్రూప్ అధినేత భరత్ కుమార్ కక్కిరేణి

  • ‘FUTUREPRENEURS’ – భవిష్యత్ వ్యాపారవేత్తలకు మార్గదర్శనం

అమరావతి, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్నోవేటర్స్ క్వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ‘FUTUREPRENEURS’ అనే అంశంపై బుధవారం ప్రత్యేక సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేబీకే గ్రూప్ అధినేత డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా “Entrepreneurship as a Career” అంశంపై విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన అవకాశాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి వివరించారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా మారేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల గురించి విద్యార్థులతో పంచుకున్నారు. ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలంటే నిత్యం విద్యార్థిగా అధ్యయనం చేయాలని సూచించారు. సమాజం అవసరాలను గుర్తించి, వాటి తీర్చే సరికొత్త ఆలోచనలతో స్టార్టప్ లు ప్రారంభించాలని చెప్పారు.

అనంతరం డిజిటల్ మార్కెటింగ్, ఏఐ నిపుణులు నిఖిల్ గుండా మాట్లాడుతూ “Digital Entrepreneurship Using AI” అనె అంశం పై ఉత్సాహభరితమైన సెషన్ నిర్వహించారు. ఆధునిక వ్యాపార రంగంలో కృత్రిమ మేధస్సు (AI) తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, వ్యాపారాలను వేగంగా విస్తరించడంలో AI పాత్రను ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. ఆంత్రప్రెన్యూర్షిప్ లో AI ని ఎలా వినియోగించుకోవాలో మెళకువలు బోధించారు.

కార్యక్రమం ముగింపులో స్టార్టప్ ఫండింగ్, మార్కెట్ వాలిడేషన్, టెక్నాలజీ వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇరువురూ సమాధానాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అతిథులు, అధ్యాపకులు, విద్యార్థులందరికీ ఇన్నోవేటర్స్ క్వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు హర్షిత్ మనీధర్ కురువేళ్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపార స్ఫూర్తిని పెంపొందించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button