Rain Alert: రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

Rain Alert: రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది..
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాలలో ఒడిస్సా వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల మధ్యలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది.
దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఏపీలోనూ నేడు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.



