ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు

Tirumala: శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గత 9 రోజులుగా జరిగిన వైకుంఠద్వార దర్శనాల్లో రికార్డు స్థాయిలో 7,09,831 మంది భక్తులకు టీటీడీ దర్శనం కల్పించింది. నిన్న ఒక్కరోజే 85,752 మంది భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.69 కోట్లకు చేరింది. దర్శనాల కోసం కంపార్టమెంట్లు, షెడ్లు నిండిపోగా, శిలాతోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.



