తమ్ముడు రిలీజ్‌తో దిల్ రాజు సంచలనం!

Dil Raju: నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ‘తమ్ముడు’ జూలై 4న విడుదలకు సిద్ధం. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి దిల్ రాజు సినిమా ప్రమోషన్స్‌లో కీలక విషయాలు వెల్లడించారు. ‘ఐకాన్’ సినిమాపై సంచలన ప్రకటన చేశారు.
టాలీవుడ్‌లో స్టార్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘తమ్ముడు’ సినిమా జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దిల్ రాజు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో అల్లు అర్జున్‌తో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ సినిమా ఆలస్యం కావడంతో అర్జున్ ‘పుష్ప’తో బిజీ అయ్యారు.
దీంతో ‘ఐకాన్’ ప్రాజెక్ట్‌పై సందేహాలు వచ్చాయి. కానీ, దిల్ రాజు క్లారిటీ ఇస్తూ ‘ఐకాన్’ ఖచ్చితంగా ఉంటుందని, త్వరలోనే కొత్త హీరోతో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని ప్రకటించారు. ఈ వార్తతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొత్త హీరో ఎవరు? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అనే చర్చ మొదలైంది.