ఆంధ్ర ప్రదేశ్
Narayana: జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయ్

Narayana: జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు వింతగా ఉన్నాయన్నారు నారాయణ. అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రజలపై భారం ఉండదన్నారు. సీఎం చంద్రబాబు లక్ష్యం మేరకు ప్రపంచంలోని టాప్ మోస్ట్ అయిదు నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామన్నారు. 63వేల కోట్లతో ఏపీ రాజధాని నిర్మాణం జరుగుతోందని నారాయణ వెల్లడించారు.
బడ్జెట్ లో 6వేల కోట్లు కేటాయించామన్న మంత్రి ప్రజలు వైసీపీ నేతల మాటలు నమ్మొద్దన్నారు. అలాగే నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో ఇరిగేషన్ స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి నకిలీ పట్టాలిచ్చారని అన్నారు.