సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'తండేల్' చిత్ర బృందం

తిరుమల శ్రీవారిని తండేల్ చిత్రబృందం దర్శించుకుంది. ఉదయం.. నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తండేల్ చిత్రం విజయం సాధించిన సందర్భంగా.. తామంతా తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు చందూ మొండేటి తెలిపారు.