సినిమా

The Raja Saab: ది రాజాసాబ్ పై తమన్ సంచలన హైప్!

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ క్లైమాక్స్‌పై క్రేజీ పోస్ట్ పెట్టారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ప్రభాస్ హీరోగా మరుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ ఫాంటసీ చిత్రం. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ తన ఎక్స్ ఖాతాలో ‘క్లైమాక్స్. ఐమ్యాక్స్. మారుతి మ్యాక్స్’ అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో క్లైమాక్స్ హై వోల్టేజ్ యాక్షన్‌తో ఉంటుందని అర్థమవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button