జాతియం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకులు అరెస్ట్

జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల సహాయకుల్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం షోపియాన్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. సీఆర్పీఎఫ్ ఇండియన్ ఆర్మీ బలగాల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోండగా ఇద్దరు ఉగ్రవాదుల సహాయకుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఉగ్రవాద సహాయకుల నుండి రెండు పిస్టళ్లు, నాలుగు గ్రనేడ్లు, 43 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.