తెలంగాణ
మద్యం టెండర్లపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Telangana: తెలంగాణ మద్యం టెండర్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. టెండర్ల గడువు పొడగింపును సవాల్ చేస్తూ ఐదుగురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ ఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది.



