తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కాంగ్రెస్ జిల్లా, మండలాల వారిగా పల్లె నిద్ర చేపట్టనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి నేతలు ఆ పార్టీ కార్యకర్తల నివాసంలో బస చేయనున్నారు. కార్యక్రమాన్ని పసీసీ చీఫ్ మహేష్ కుమార్ ప్రారంభించనున్నారు. సాయంత్రం గ్రామాల్లోకి రాష్ట్ర నేతలు వెళ్లి రాత్రికి పల్లెల్లో బస చేయనున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనంలోకి చేరవేత, స్థానిక సంస్థల ఎన్నికలకు పల్లె నిద్ర ఉపయోగపడనున్నట్లు టీ కాంగ్రెస్ భావిస్తుంది. త్వరలో నేతల షెడ్యూల్‌ను టీపీసీసీ ఖరారు చేయనుంది. కార్యక్రమంలో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్, సీఎం మంత్రులు పాల్గొననున్నారు.