తెలంగాణ
KTR: ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం దుర్మార్గం

KTR: హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ వైఖరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్‌లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టవచ్చా అని ప్రశ్నించారు. మీ అన్న తిరుపతి రెడ్డికి దుర్గం చెరువుకు FTL లో ఇల్లు ఉండొచ్చు. మీ రెవెన్యూ మంత్రికి హిమాయత్ సాగర్‌లో ప్యాలెస్ కట్టవచ్చా అని ప్రశ్నించారు. మీ చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి చెరువు మధ్యలో గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు.
పెద్ద బిల్డర్లు మీకు లంచం ఇచ్చి మూసీ నదిలోనే అపార్ట్‌మెంట్ కట్టుకోవచ్చు. కానీ మీకు, హైడ్రాకు ఇవేవీ కనిపించవు. తమ ఇల్లు కూల్చొద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు బాదుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గం అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.