Ponnam Prabhakar: మహిళా సాఫ్ట్ బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి.. మంత్రి పొన్నం అభినందనలు

Ponnam Prabhakar: తెలంగాణ నుండి ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకి ఎంపికైన చెపుర్వ ప్రవళికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. భారత జట్టు జూలై 14-20 వరకు చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా కప్ ఉమెన్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ కోసం హైదరాబాద్ కి చెందిన చెపుర్వ ప్రవళిక భారత్ జట్టుకు ఎంపిక కావడంతో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చెపుర్వ ప్రవళికను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ నుండి భారత మహిళా జట్టు క్రీడాకారిణిగా చెపుర్వ ప్రవల్లిక ఎంపికవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. చెపుర్వ ప్రవళికకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ జూన్ 20 నుండి జూన్ 25, 2025 వరకు శ్రీనగర్‌లో జరుగుతుంది. చైనాలోని జియాన్ లో జరగనున్న ఆసియా కప్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో చెపుర్వ ప్రవళిక బాగా రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.