కిష్కింధపురి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Kishkindhapuri: హార్రర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’ టీజర్ రిలీజ్ కు సిద్ధమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది.
టాలీవుడ్లో హార్రర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ‘కిష్కింధపురి’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌తో హైప్ పెంచింది.
దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉంది. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15 సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నారు. సాహు గారపాటి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హార్రర్, థ్రిల్లర్ అంశాలతో పాటు బలమైన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.



