ఆంధ్ర ప్రదేశ్
మార్కాపురంలో టీడీపీ శ్రేణులు సంబరాలు

Markapuram District: ఇచ్చిన మాట ప్రకారం వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడంతో టీడీపీ నేతల సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చేపట్టిన బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు.
వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జీవితాంతం ఈ మేలును గుర్తించుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.



