Talasani Srinivas Yadav: ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టింది కాంగ్రెస్

Talasani Srinivas Yadav: తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్లోని బన్సీలాల్పేట్లో ఆటో డ్రైవర్లతో ముఖా ముఖి అయిన తలసాని ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జబ్బార్ కాంప్లెక్స్ నుండి రాణిగంజ్ వరకు ఆటో నడిపారు తలసాని. ఆటో రిక్షా కార్మికులు గత రెండు ఏళ్ల నుండి పేదరికంలో మగ్గుతున్నారన్నారు.
ఆర్టీసీ బస్సులలో మహిళలకు ప్రయాణాన్ని ఉచితంగా కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ పొట్ట కొట్టిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12000 ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటికి అమలు చేయలేదన్నారు. చేతకాని హామీలను ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ ఓట్లు దండుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని రానున్న రోజుల్లో లక్ష మంది ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హచ్చరించారు.



