జాతియం
Manmohan Singh: నేడు అధికార లాంఛనలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..

Manmohan Singh: మాజీ ప్రధాని, ఇండియాలో ఆర్థిక సంస్కరణల సృష్టికర్త అయిన మన్మోహన్ సింగ్ ఇక లేరు అనే వార్తను భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదరహిత నేతగా గుర్తింపు పొందిన మహ్మోహన్ సింగ్ మరణంపై అన్ని పార్టీల నేతలూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగబోతున్నాయి. వీటికి కేంద్ర పెద్దలు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ సంతాపం తెలుపుతూ.. ఏడు రోజులు కేంద్రం సంతాప దినాలు ప్రకటించింది.