జాతియం

Himachal Pradesh: కారు లోయలో పడి.. ఆరుగురు దుర్మరణం

Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం, చంబా జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. కొండచరియల నుండి పడిన ఒక పెద్ద రాయి కారును ఢీకొనడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రాజేశ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, కొండ ప్రాంతం నుండి పడిన ఒక బండరాయి వారి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

దీనితో కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రాజేశ్, ఆయన అర్ధాంగి హన్సో, వారి కుమార్తె ఆర్తి , కుమారుడు దీపక్, బావమరిది హిమరాజ్, మరొక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button