ఆంధ్ర ప్రదేశ్
Bapatla: దారుణం.. నడిరోడ్డుపై భర్తను ఉరివేసి చంపిన భార్య..

Bapatla: బాపట్ల జిల్లా కొత్త పాలెంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై భర్తను భార్య హత్య చేసింది. మద్యానికి బానిసగా మారి వేధిస్తున్నాడంటూ భర్త ప్రాణాలు తీసింది. కొత్తపాలెంకు చెందిన అరుణ.. గోకర్ణమఠంకు చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహం అయింది. గత నాలుగేళ్లుగా అమరేంద్రబాబు మద్యానికి బానిస అయ్యాడు.
భార్య భర్తలమధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో.. అరుణ తన స్వగ్రామం అయిన కొత్తపాలెంలో ఉంటోంది. దీంతో అమరేంద్రబాబు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన భార్య అరుణను కొట్టడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేశారు. దాడిలో గాయపడి కిందపడిన భర్తను అరుణ గొంతుకు తాడు వేసి లాగి చంపడం స్థానికంగా కలకలం రేగింది.