సమంతను కాపీ కొట్టిందంటూ శోభితపై ట్రోలింగ్

‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రేమలో పడ్డ సమంత- నాగచైతన్య ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత 2017లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తరువాత నాగ చైతన్య మరో హీరోయిన్ శోభితని పెళ్లి చేసుకున్నాడు. అయితే చైతూ, సమంత విడిపోయి ఐదేళ్లు గడిచినప్పటికీ తరచూ వీరిద్దరిని ముడిపెడుతూ ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.
రీసెంట్ గా ‘వోగ్’ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం నాగచైతన్య, శోభిత చేసిన ఫోటో షూట్ లో శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. శోభిత సమంత స్టైల్ ని కాపీ కొట్టిందంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు.శోభిత ఈ ఫొటో షూట్ కోసం అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించింది. దీని ధర దాదాపు రూ. 49,593 పైగా ఉంటుంది. కాగా, ఇది గతంలో సమంత ధరించిన ఓం బ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.