ఎర్రబెల్లి వర్సెస్ కొండా మధ్య ఫ్యాక్షన్ గొడవలు

తెలంగాణ రాజకీయాల్లో వరంగల్ నియోజకవర్గం ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఓటర్లకన్నా ఎక్కువగా దృష్టి ఆకర్షించే అంశం – కొండా vs ఎర్రబెల్లి ఫ్యామిలీల మధ్య సాగుతున్న వైరం. ఇటీవల కొండా మురళీ వ్యాఖ్యల తర్వాత ఈ యుద్ధం మరింత ముదిరింది. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శల స్థాయి హద్దుమీరిపోయింది. తాజాగా బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మంత్రివర్గ సభ్యురాలు కొండా సురేఖపై ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ప్రదీప్ రావు విమర్శలు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు కారణమైంది. కొండా మురళీ ఎర్రబెల్లిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దాయాదుల రాజకీయాన్ని మరింత వేడిక్కించాయి.
ఈ పోరు ఇప్పుడు కేవలం స్థానిక స్థాయికే పరిమితం కాదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు మధ్య సీటు రాజకీయం కొత్త ట్విస్టులు తీసుకుంటోంది. సురేఖపై అనర్హత పడితే, బహుశా అది ప్రదీప్ రావుకే అడ్వాంటేజ్ అవుతుంది. ఓటమిని దాటుకుని కార్యకర్తల్లో తిరుగుతూ ఉన్న ప్రదీప్ రావు, అధికారంలో ఉన్నా ఒత్తిడిలో ఉన్న కొండా సురేఖ, వరంగల్ రాజకీయ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది చూడాలి.
మంత్రి, కాంగ్రెస్ MLA కొండా సురేఖ భర్త కొండా మురళి జూన్ 30 తేదీన వరంగల్లో జరిగిన ఆర్యవైశ్యుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల అఫిడవిట్‌లో కొండా సురేఖ కేవలం 14 ఎకరాల భూమి మాత్రమే ఉందని తప్పుడు పత్రాలు సమర్పించారని ఆరోపించారు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు. నేడేమో తనకు 500 వందల ఎకరాల భూమి ఉందని, ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశామన్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.
గత ఎన్నికల్లో సురేఖకు టఫ్ ఫైట్ ఇచ్చిన ప్రదీప్ రావు, మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని ఈసీని కోరారు. కొండా దంపతులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించాడు. సురేఖను అనర్హురాలుగా గుర్తించి సభ నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు కొండా సురేఖను అనర్హురాలిగా గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో ప్రదీప్ రావు డిమాండ్ చేశారు.