ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నుంచి విడిపోయిన ఏసీ బోగీలు

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ నుంచి ఏసీ బోగీలు విడిపోయాయి. ప్రస్తుతం విడిపోయిన బోగీలను రైల్వే సిబ్బంది అమరుస్తుంది. మరోవైపు ఘటన నుంచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పలాస మండలం సుమ్మాదేవి దగ్గర ఈ ఘటన జరిగింది. పెను ప్రమాదం తప్పడంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.