ఆంధ్ర ప్రదేశ్
Vijayasai Reddy: జగన్‌కు మాజీ ఎంపీ విజయసాయి కౌంటర్

Vijayasai Reddy: వైసీపీ అధినేత, వైఎస్ జగన్‌కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తాను వ్యక్తిగత జీవితంలో విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడినన్నారు.
అందుకే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకీ లొంగలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్న విజయసాయి రెడ్డి అందుకే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నట్లు వివరించారు.