దెబ్బతిన్న పాక్-ఆఫ్ఘన్ సంబంధాలు.. రంగంలోకి దిగిన డ్రాగన్

ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతోంది. లేని సంబంధాలు పుడుతున్నాయ్. ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయ్. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబన్‌తో కొట్లాడుతోంది. ఒకరిని ఒకరు చంపుకుంటుంటే.. నేనున్నానంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది డ్రాగన్. అసలు విషయం ఏంటంటే తాలిబన్ సర్కారుతో ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ చర్చలు జరపడంతో శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు.
ఈ మొత్తం కథలో చైనా దుష్టపన్నాగం స్పష్టమవుతోంది. అంతిమంగా ఇండియా ఎంట్రీ ఇప్పుడు మూడు దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి చైనా ఒక సమావేశం నిర్వహించింది. రెండు దేశాలు పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే రెండు దేశాలకు తాము సహకారం అందిస్తామంది. దీంతో పాక్ మెట్టు దిగింది. మొన్నటి వరకు ఆప్ఘనిస్తాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న పాక్ పాలకులు చైనా ఆదేశాలతో దారిలోకి వచ్చారు.
త్వరలో కాబూల్‌కు రాయబారిని పంపుతామని పాక్ పేర్కొంది. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించడం ఇదే తొలిసారి. గత వారం బీజింగ్‌లో చైనా ప్రతినిధి, తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిని ముత్తాఖీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు రాయబారి కంటే తక్కువ స్ట్రెంథ్‌తో కొనసాగుతున్నాయ్.
గత వారం బీజింగ్‌లో నిర్వహించిన మంత్రివర్గ స్థాయి సమావేశంతో పాటు, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గత నెలలో పాకిస్తాన్ ప్రతినిధి బృందంతో కలిసి కాబూల్‌కు ప్రయాణించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనను వివరించారు. చర్చల తర్వాత ఆప్ఘన్-పాక్ మధ్య సానుకూలత పెరిగుతున్ట్టుగా ఉంది.
తాలిబన్లతో సంబంధాలను మెరుగుపరచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ మంత్రి దార్ అన్నారు. రాయబారిని పంపాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండు సోదర దేశాల మధ్య మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. అయితే, కాబూల్‌కు పంపే వ్యక్తిని పాకిస్తాన్ రాయబారి స్థాయా కాదా అన్నది చెప్పలేదు. తాలిబన్ కూడా ఇస్లామాబాద్ చర్యలకు స్పందించలేదు. ప్రస్తుతం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో చిన్నసైజులో మాత్రమే దౌత్య సిబ్బందిని కొనసాగిస్తోంది.
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించుకోవడం దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని చాటుకోవాలనుకుంటోంది. ముగ్గురు విదేశాంగ మంత్రులు హాజరైన సమావేశంతో పాటు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌లతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. కాబూల్‌లో తాలిబన్ల గుర్తించిన మొదటి దేశం చైనా అయినప్పటికీ, అధికారికంగా ఆప్ఘనిస్తాన్‌తో సంబంధాలను అధికారికంగా ఏర్పాటు చేసుకోలేదంటోంది.
అయితే, మే 15న భారతదేశం తాలిబన్ పాలకులను సంప్రదించడంతో ఒక్క దెబ్బకు చైనా రంగంలోకి దిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2021 తర్వాత మొదటిసారి కాబూల్‌తో మంత్రి స్థాయి చర్చలు జరిపారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా చైనాను సైతం దూరం పెట్టేలా ఇండియా మంత్రాంగం దెబ్బకు మొత్తం వ్యవహారం తెరపైకి వచ్చింది.
గత వారం తాలిబన్ మంత్రితో సమావేశం తర్వాత, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఒప్పందంలోకి ఆప్ఘనిస్తాన్ చేరిందని చైనా చెబుతోంది. తమ జోక్యంతో రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడిందంటోంది. డిసెంబర్ 2024 నుండి ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆ ప్రాంతంలో బాంబు దాడి చేసిన తర్వాత దాదాపు 50 మంది మరణించారు.
పాకిస్తాన్ లోపల దాడులు చేసేవారు ఆఫ్ఘన్ నుంచి వస్తున్నారని పాకిస్తాన్ మండిపడుతోంది. ఐతే పాక్ చర్యలపై ఆప్ఘనిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు పాకిస్తాన్ లోపల నుండే జరుగుతున్నాయని, పాకిస్తాన్ సృష్టిస్తున్న ఉగ్రవాదులే దాడులు కారణమంది. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడమన్నది పాకిస్తాన్ సొంత సమస్య అని ఆప్ఘన్ పేర్కొంది. పాకిస్తాన్ వేల మంది శరణార్థులను బహిష్కరిస్తున్న తీరుపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ సర్కారు కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా నేతృత్వంలోని నాటో దళాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుండి ఏ దేశం అధికారికంగా తాలిబన్ పరిపాలనను గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయులు తాలిబన్లు మహిళల హక్కులపై పెదవివిరుస్తున్నారు. పంథా మార్చుకుంటేనే దౌత్యబంధాలు కొనసాగిస్తామంటున్నారు.
చైనా, యుఎఇ, ఉజ్బెకిస్తాన్ తర్వాత కాబూల్‌కు రాయబారిని నియమించిన నాల్గో దేశం పాకిస్తాన్ ఇప్పుడు అవతరించనుంది. రెండు ముస్లిం పొరుగు దేశాల మధ్య పగలు తగ్గించేందుకు చైనా మధ్యవర్తిత్వం చేపట్టింది. చైనా ఆహ్వానంతో బీజింగ్ వేదికగా జరిగిన మంత్రివర్గ స్థాయి సమావేశం అనంతరం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.